స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఇటీవల తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లికి సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రియుడితో రకుల్ ప్రీత్ రిలేషన్ బ్రేక్ అవుతుంది అంటూ పాపులర్ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పడం ఆమె అభిమానులకు షాక్ ఇస్తోంది. గతంలో నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు, అఖిల్ అక్కినేని గురించి ఆయన చెప్పిన జోస్యం నిజం అయ్యింది. జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ సమస్యలను ఎదుర్కొంటారని, రకుల్ నక్షత్రం రాశి, జాకీ రాశిని, వారి గ్రహాల స్థానాలు వివాహానికి అనుకూలంగా లేవని ఆయన వెల్లడించారు.
Read Also : గాసిప్ గ్యాంగ్ లో ప్రియా!
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని నిశ్చితార్థం రద్దు అవుతుందని, వారి రిలేషన్ బ్రేకప్ తో ముగుస్తుందని జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పాడు. ఒకవేళ అన్నీ కాదనుకుని ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకుంటే వైవాహిక సమస్యలను ఎదుర్కోక తప్పదని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒక చట్టపరమైన సమస్య కారణంగా రకుల్ జైలుకు వెళ్తుందని చెప్పి భారీ షాక్ ఇచ్చాడు. కాగా ఇటీవలే ‘కొండపొలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ‘ఓబులమ్మ’గా అలరించింది.
