రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. కెరటం అనే సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యింది.వరుస గా స్టార్ హీరో ల సినిమాల్లో నటించి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లో నటిస్తూ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా మంచి అవకాశాలను అందుకుంది.ఈమె బాలీవుడ్ హీరో నిర్మాత జాకి భగ్నాని తో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా నే చెప్పుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ రహస్యం గా పెళ్లిచేసుకున్నారని అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.
తాజాగా ఈ వార్తల పై రకుల్ స్పందించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ సందర్బం గా మాట్లాడుతూ.. మేమిద్దరం రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని నేను దాచాలని ఏరోజు కూడా అనుకోలేదు. అలా చేయడానికి నేను చిన్నపిల్లని కాదు.ప్రేమ, పెళ్లి అనేవి అందరి జీవితాల్లో జరుగుతూ ఉండేవే. ఇందులో దాచడానికి అయితే ఏమి లేదు.. మేము మా ఇద్దరి విషయం అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా బాగా రూమర్స్ వస్తున్నాయి. కొన్ని మీడియాల్లో ఇప్పటికే రెండు సార్లు మా ఇద్దరికీ పెళ్లి ని కూడా చేసేశారు. గత డిసెంబర్లో మా పెళ్లి అయినట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి లో మేము రహస్యం గా వివాహం చేసుకున్నామని కూడా రాసారు.. కాబట్టి మేము నిజంగా పెళ్లి చేసుకున్న రోజు వాళ్ల కు కచ్చితంగా చెప్తాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
