NTV Telugu Site icon

Rakshit Shetty: రష్మికను రక్షిత్ ఇంకా మరచిపోలేదా.. టచ్ లోనే ఉన్నాడట!

Rakshith Shetty On Rashmika Mandanna

Rakshith Shetty On Rashmika Mandanna

Rakshit Shetty Shocking Comments On Relation with Rashmika Mandanna: కన్నడ హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందన కిరిక్ పార్టీ సమయంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జన్మించిన ప్రేమ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకునే వరకు వెళ్ళింది. అయితే తర్వాత కాలంలో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని రష్మిక తెలుగు సినిమాల్లో బిజీ అవ్వగా రక్షిత్ శెట్టి కూడా కన్నడ సినీ పరిశ్రమ తలెత్తుకునేలా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల కన్నడలో సప్త సాగర దాచేయల్లో పేరుతో రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాని సప్త సాగరాలు దాటి పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా తెలుగు మీడియా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రక్షిత్ శెట్టికి రష్మిక మందన గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటికీ రష్మిక -రక్షిత్ టచ్ లోనే ఉన్నారా అని అడిగితే దానికి అవును టచ్ లోనే ఉన్నాం అని ఆయన సమాధానం చెప్పాడు.

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్

ఆమె ఎప్పుడూ పెద్ద ఆశయాలతో ఉండేదని ఇప్పుడు ఆ ఆశయాలను సాధిస్తుందని ఆ విషయంలో ఆమెను అభినందించి తీరాల్సిందేనని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు. మరోపక్క రక్షిత్ శెట్టి పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు ఏమీ లేవని ఒకవేళ చేసుకోవాలి అనిపిస్తే మీ అందరికీ చెప్పే చేసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన ప్రొడక్షన్ బ్యానర్ అయిన పరమవాహ్ స్టూడియోస్ పూర్తిగా తనది మాత్రమే కాదని తనతో పాటు దుబాయ్ లో ఉండే ఒక పార్ట్నర్ కూడా ఉన్నాడని అని చెప్పుకొచ్చాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తాను చేయబోయే తదుపరి నాలుగు సినిమాలు తానే డైరెక్ట్ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు రక్షిత్.

Show comments