Rakshit Attluri, Komalee’s “Sasivadane ” grand release on April 19: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’, గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించగా ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘‘శశివదనే సినిమాను ఏప్రిల్ 5 ని కాకుండా ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నాం, సినిమా ఫస్ట్ కాపీ చూసుకుని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దర్శకుడు సాయి మోహన్ కథ చెప్పిన విధానం నాకు ముందు అర్థం కాలేదు. అప్పుడు నేను తనని నువ్వు పలాస సినిమా చూశావా అని అడిగా, దానికి తను లేదు సార్ అన్నాడు. పలాస సినిమా చూడకుండా నేను ఈ సినిమాను ఎలా పెర్ఫామ్ చేయగలను అనుకున్నావని అడిగా, రాత్రికి సినిమా చూసి మాట్లాడుతానని అన్నాడు. అలా జర్నీ ప్రారంభమైంది.
Maa Annayya: సీరియల్ నిర్మాణంలోకి మైత్రీ మూవీ మేకర్స్.. ‘మా అన్నయ్య’ను దింపుతున్నారు!
హను రాఘవపూడి దగ్గర సాయి వర్క్ చేశాడు. తను కూడా హనులా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్ తో పాటు తండ్రి ఎమోషన్‌ని సాయి ముందుగా రాసుకున్నాడు. పలాస కంటే శశివదనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా, అవుతుందని నమ్మకంగా ఉన్నాను. అలాగే డైరెక్టర్ రాసుకున్న కథను బ్రహ్మాండంగా మా సినిమాటోగ్రాఫర్ సాయికుమార్ దారి విజువలైజ్ చేసి, అద్భుతంగా చూపించారు. తను పెద్ద సినిమాటోగ్రాఫర్ అవుతారు. శరవణన్ మంచి పాటలు ఇచ్చారు. అనుదీప్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రాఘవ అనే పాత్రలో నేను బాగా నటించటానికి కారణం శశి పాత్రలో అద్భుతంగా చేసిన కోమలి. ఈ సినిమాలో నన్ను చూసినట్లు వేరే సినిమాలో కనిపించలేదు, క్లైమాక్స్ విషయానికి వస్తే.. నాది, కోమలి పెర్ఫామెన్స్ చూస్తే మీరే గొప్పగా చెబుతారు. సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. మా నిర్మాతలు తేజ, గౌరి, అభిలాష్ చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు.
