Site icon NTV Telugu

Shivoham: రాక్షసుడు డైరెక్టర్ శివోహం అంటున్నాడు…

Shivoham

Shivoham

రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ రమేష్ వర్మ. రీమేక్ చేసినా కూడా ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ అవ్వకుండా రాక్షసుడు సినిమా చేసిన రమేష్ వర్మ… తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడిగా మారి 2009లో వచ్చిన నాని-తనీష్ నటించిన రైడ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రమేష్ వర్మకి హిట్ అనే మాటే తెలియదు. మాస్ మహారాజా రవితేజ ‘వీర’ సినిమా చేసే అవకాశం ఇచ్చినా అది ఫ్లాప్ అవ్వడంతో రమేష్ వర్మ కెరీర్ కష్టాల్లో పడింది. ఇక ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా మర్చిపోతున్నారు అనుకునే సమయంలో 2019లో వచ్చిన రాక్షసుడు సినిమా రమేష్ వర్మని మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఈ సినిమాతో హిట్ కొట్టగానే రవితేజని రెండోసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ని పట్టేసాడు రమేష్ వర్మ.

అలా ఖిలాడీ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది, హైప్ అయితే క్రియేట్ అయ్యింది కానీ సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. దీంతో రమేష్ వర్మ పని అయిపొయింది అనుకున్నారు. అయితే రమేష్ వర్మ మాత్రం ఊహించని విధంగా తెలుగు, తమిళ బైలింగ్వల్ ప్రాజెక్ట్ తో బయటకి వచ్చాడు. ఈరోజు రమేష్ వర్మ బర్త్ డే కావడంతో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ హౌజ్ తెలుగు, తమిళ భాషల్లో ‘శివోహం’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. శివోహం అనౌన్స్మెంట్ పోస్టర్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఈ పోస్టర్ చూస్తుంటే రాక్షసుడు సినిమాతో సైకో డ్రామా తీసిన రమేష్ వర్మ, ఈసారి దేవుడు-దెయ్యం కాన్సెప్ట్ కి కానీ ఏదైనా గుడి కాన్సెప్ట్ తో కానీ సినిమా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రెండు సెల్లింగ్ పాయింట్స్ కాబట్టి రమేష్ వర్మ కాస్త జాగ్రత్తగా శివోహం సినిమాని తెరకెక్కిస్తే చాలు మరో హిట్ కొట్టేసినట్లే.

Exit mobile version