Rakkayie Title Teaser : భయంకర విలన్లపై నయనతార ఊచకోత
- నయనతార కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్
- ‘రక్కాయీ’ టైటిల్ తో సెంథిల్ దర్శకత్వంలో మూవీ
- టీజర్ లో ఓ బిడ్డకు తల్లిగా కనిపించిన నయనతార
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakkayie Title Teaser : లేడీ సూపర్ స్టార్, హీరో ధనుష్ మధ్య నడుస్తోన్న వివాదం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నయనతార లైఫ్ స్టోరీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ డాక్యుమెంటరీలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయన్ జంటగా నటించిన ‘నేను రౌడీనే’ సినిమాకి సంబందించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఉపయోగించారు. ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నిర్మించారు. తన అనుమతి లేకుండా వీడియో క్లిప్ ఉపయోగించడంపై ధనుష్ నయన్ కి లీగల్ నోటీసులు అందజేశారు. రూ.10 కోట్లు పరిహారంగా ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశారు. దీనిపై నయన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ధనుష్ పైన తీవ్రవిమర్శలు చేశారు. ఇక నయన్ ఓపెన్ లెటర్ పై ధనుష్ అభిమానులు రియాక్ట్ అయి ఆమెని టార్గెట్ చేస్తున్నారు. మరో వైపు నయనతార అభిమానులు కూడా ధనుష్ ఫ్యాన్స్ కి సీరియస్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.
Read Also:Eatala Rajendar: 144 సెక్షన్ పెట్టి అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు..
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
ఇలాంటి సమయంలో నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ముందుగా ఆమె యుద్ధం ప్రకటించిందంటూ ఓ పోస్టర్ ను మేకర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ హీరో ధనుష్ ని ఉద్దేశించి ఆమె హెచ్చరికగా ఉందంటూ నయనతార అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ‘రక్కాయీ’ టైటిల్ తో సెంథిల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ లో నయనతారని ఓ బిడ్డకు తల్లిగా చూపించారు. ఆమె ఒక గుడిసెలో నివసిస్తుంది. అక్కడికి ఆమెని చంపడానికి రౌడీ మూకలు తరలి వస్తుంటారు. గుడిసెలో బిడ్డ ఊయల్లో ఏడుస్తూ ఉంటుం. మిరపకాయలు రోకలిలో దంచుతుంది. తరువాత బిడ్డకి పాలు పట్టి ఒక కొడవలిని వెదురు కర్రకి కట్టి బయటకొచ్చి ఎదురుగా నిల్చుంటుంది.
Read Also:DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
తనపై దాడి చేయడానికి వచ్చే వారి మీద ఎదురుదాడి చేసి ఊచకోత కోస్తుంది. గోవింద్ వసంత పవర్ ఫుల్ ఎలివేషన్ మ్యూజిక్ తో అదిరిపోయే విజువల్స్ తో ఈ టీజర్ ఉంది. టీజర్ లో నయనతార లుక్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ టీజర్ చూస్తుంటే పీరియాడికల్ యాక్షన్ మూవీ అని అర్థం అవుతోంది. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీవెర్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. మూవీ టీజర్ ద్వారా రక్కాయీతో నయనతార ఏదో పెద్ద టార్గెట్ వేసిందని అర్థం అవుతుంది.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?