బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల విషయం పక్కన పెడితే, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి ఆమె నటి ఊర్వశి రౌతేలా పై నిప్పులు చిమ్మింది. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో “నేను పూర్తిగా నేచురల్ బ్యూటీ”, “మౌంటేన్ గర్ల్” అంటూ చెప్పిన వ్యాఖ్యలు రాఖీకి నచ్చలేదు. దీంతో ఆమె ఊర్వశిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
Also Read : Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?
“ఊర్వశీ మేము నీ పాత ఫోటోలు చూశాం కదా! ఈ రోజుల్లో చాలా మంది సన్నగా కనిపించడానికి తమ పక్కటెముకలు విరగ్గొట్టుకుంటున్నారు. ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది. చైనా, బ్యాంకాక్, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఇలా సర్జరీలు చేస్తారు. నడుము సన్నగా కనిపించాలంటే రిబ్స్ తొలగించుకుంటారు. అందులో తప్పేమీ లేదు కానీ ‘నేను సహజంగా ఇలా ఉన్నాను’ అని అబద్ధం చెప్పొద్దు,” అంటూ రాఖీ చెప్పింది. అంతే కాదు “మేము నిన్ను మొదట చూసినప్పుడు నువ్వు ఇంతలా లేవు. ఇప్పుడు ఎంత మారిపోయావో అందరికీ తెలుసు. దయచేసి సహజ సౌందర్యం అంటూ అతి చేయొద్దు” అని రాఖీ సెటైర్లు వేసింది.
‘ఎవరైనా తమ లుక్ మార్చుకోవాలనుకుంటే, అది వారి ఇష్టం. కానీ దాన్ని సహజమని చెప్పడం మాత్రం సరికాదు’ అని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా ఊర్వశితో పోలికల విషయంలో రాఖీ ఆగ్రహం వ్యక్తం చేసింది. “నన్ను ఊర్వశి తో పోల్చడం అవమానం. దయచేసి నన్ను బ్రిట్నీ స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్, షకీరా లేదా కిమ్ కర్దాషియన్‌లతో పోల్చండి!” అంటూ అప్పట్లో మీడియా ముందే మండిపడింది. ప్రస్తుతం రాఖీ ‘జరూరత్’ అనే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె నటుడు షాబాజ్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేసింది. మరోవైపు ఊర్వశి రౌతేలా ప్రస్తుతం నటుడు అఫ్తాబ్ శివదాసాని, జస్సీ గిల్ సరసన నటిస్తున్న ‘కసూర్ 2’ చిత్రంతో బిజీగా ఉంది. మొత్తం మీద ఊర్వశి చేసిన “నేచురల్ బ్యూటీ” వ్యాఖ్యలకు రాఖీ సావంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి!
