Site icon NTV Telugu

Rakhi Sawant: భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడితో హీరోయిన్.. ఇంతలో షాక్!

Rakhi Sawant

Rakhi Sawanth

బాలీవుడ్ వివాదస్పద నటి రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు అన్ని వివాదాస్పదమే. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక ఆమె ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. భర్త రితేష్ సింగ్ తో విడిపోయిన వెంటనే ఆమె కంటే ఆరేళ్ళ చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఒక్కసారిగా చేతికి డైమండ్ రింగ్ తో కనిపించి నిశ్చితార్ధం అయిపోయినట్లు తెలిపి ఔరా అనిపించింది. సరే లే అమ్మడు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకున్న అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ వచ్చారు. ఇక అతి త్వరలోనే అమ్మడు పెళ్లి పీటలు ఎక్కుతుంది అనుకొనేలోపు ఆమెకు షాక్ ఇచ్చింది ఒక యువతి.. ఆమె ఎవరు కాదు రాఖీ బాయ్ ఫ్రెండ్ అదిల్ మాజీ ప్రేయసి.. నా బాయ్ ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చిందట. దీంతో రాఖీ పెళ్లి చేసుకోవాలా..? వద్దా..?ఆ అన్న డైలమాలో పడిపోయిందని బాలీవడో వడగళ్ళు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అస్సలు సంగతి ఏంటంటే.. అదిల్‌ దురానీ, రోషిన దెలవరి ఇద్దరు నాలుగేళ్ళ క్రితం ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వలన వారి రిలేషన్ ముగిసిపోయింది. ఇక ఇటీవల అదిల్, రాఖీ ప్రేమలో పడ్డాడు. పడినవెంటనే అమ్మడికి బహుమతిగా బీఎమ్‌డబ్ల్యూ కారు ఇచ్చేశాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తూ రాఖీ వెలికి ఉంగరం తొడిగేశాడు. ఇక దీంతో అమ్మడు ఊహల్లో తేలిపోతుంటే ఒక్కసారిగా మాజీ ప్రేయసి ఎంట్రీ ఆమెకు షాక్ ఇచ్చింది. అదిల్‌ తనవాడని, అతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్‌ ఇచ్చిందట! అదిల్‌తో నాలుగేళ్లు రిలేషన్‌లో ఉన్నానని, అతడు ఎప్పటికీ తన సొంతమనే చెప్పిందట. ఇక ఈ విషయాన్నీ వివాదస్పద నటి, ప్రియుడ్ని అడుగగా అదంతా గతమని, ఆమె ఇప్పుడు తన మనసులో లేదని చెప్పాడట. దీంతో కొద్దిగా సముదాయించుకొన్న రాఖీ ఏదిఏమైనా అదిల్ ను వదిలే ప్రసక్తే లేదని, త్వరలోనే అతడిని పెళ్ళాడి తీరుతానని చెప్పుకొచ్చింది. మరి ఈ మూడు ముక్కలాటలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Exit mobile version