Site icon NTV Telugu

Rakhi Sawant: టవల్ కట్టుకొని డాన్స్.. స్పృహ తప్పిన నటికి గర్భాశయ ట్యూమర్

Rakhi Sawant News

Rakhi Sawant News

Rakhi Sawant Confirms She Has A Tumour in Uterus: నటి రాఖీ సావంత్ గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందన్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉంటూ వివాదాలతో సావాసం చేసే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం సాయంత్రం, నటి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు యాంజియోగ్రఫీ చేయిస్తున్నామని రాఖీ మాజీ భర్త రితేష్ కుమార్ తెలిపారు. రాఖీ గర్భాశయంలో ఒక ట్యూమర్(కణితి) ఉందని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు తాజాగా రాఖీ తన ఆరోగ్యం గురించి చెప్పింది.

Dirty Fellow: మే 24న “డర్టీ ఫెలో” వస్తున్నాడు!

రాఖీ ట్యూమర్ 10 సెంటీమీటర్లు ఉందని, శస్త్రచికిత్స తర్వాత వైద్యులు దానిని తొలగించబోతున్నారని పేర్కొంది. రాఖీ విడుదల చేసిన ప్రకటనలో ‘నేను త్వరలోనే కోలుకుంటా, నాకు బాగోలేదు. నా గర్భాశయంలో 10 సెంటీమీటర్ల ట్యూమర్ ని వైద్యులు కనుగొన్నారు, శనివారం దీనికి శస్త్రచికిత్స జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ రితేష్ నా ఆరోగ్యం గురించి మీకు తెలియజేస్తాడు. నా సర్జరీ పూర్తయ్యాక ఆ ట్యూమర్ ని కూడా చూపిస్తా, ఇప్పుడు నా రక్తపోటు మరియు ఇతర విషయాలు కూడా నియంత్రణలోకి తీసుకు రావాలి. నేను నటిని, డాక్టర్‌ని కాదు కాబట్టి ఇవన్నీ నాకు పెద్దగా తెలియవని పేర్కొంది. రాఖీ తన ప్రకటనలో ఇంకా మాట్లాడుతూ, ‘ఇక్కడి వైద్యులు అత్యుత్తమంగా ఉన్నారు, వారు తమ పనిని చాలా బాగా చేస్తున్నారు.

జీవితంలో నేనెప్పుడూ దేన్నీ వదులు కోలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటంకాలను అధిగమించి ఎన్నో పోరాటాలు చేశా, నాకేమీ జరగదని నాకు తెలుసు, అమ్మ ఆశీస్సులు ఉన్నాయి, ఆమె నాతో ఉన్నారు. నేను పోరాట యోధుడిని, నేను తిరిగి వస్తా. ఇది చిన్న ట్యూమర్ మాత్రమే, అది పోతుంది…’ అని చెబుతూ రాఖీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుందని అంటున్నారు. నేను తిరిగి వస్తాను, డ్యాన్స్ చేసి పాడతాను’ అని కూడా ఆమె చెప్పిందట. నేను ఇంట్లో టవల్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నా, రితేష్ ఇంటికి తిరిగి వచ్చేసరికి స్పృహతప్పి పడిపోయా. రితేష్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అన్ని రిపోర్టులు వచ్చేసరికి ట్యూమర్ ఉందని తేలిందని పేర్కొంది.

Exit mobile version