ప్రేమికులకు ప్రత్యేకమైన వాలంటైన్స్ డే అనగానే ప్రపోజల్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఓ కాంట్రవర్సీ బ్యూటీ మాత్రం ఈ స్పెషల్ డే మరింతగా గుర్తుండిపోయేలా భర్తకు బైబై చెప్పేసింది. బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ 2019లో ఎన్నారై రితేష్‌ని పెళ్లాడింది. అయితే బిగ్ బాస్ 15కి ముందు రాఖీ భర్త రితేష్‌ను ఎవరూ చూడలేదు. అయితే బిగ్ బాస్ నుంచి రాఖీ బయటకు రాగానే తాను, రితేష్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదని చెప్పి అందరికీ షాకిచ్చింది రాఖీ. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే రితేష్‌కి అప్పటికే పెళ్లయింది. రితేష్ మొదటి భార్య పేరు స్నిగ్ధ. ఓ ఇంటర్వ్యూలో ఆమె భర్త రితేష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే… రాఖీ, రితేష్ విడిపోయారు.
Read Also : Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?
రాఖి సావంత్ స్వయంగా ఓ పోస్ట్ ద్వారా రితేష్‌తో విడిపోయిన విషయాన్ని తెలియజేసింది. ‘అభిమానులు, నా ప్రియమైన వారందరికీ… నేను, రితేష్ విడిపోయామని మీకు చెప్పాలనుకుంటున్నాము. ‘బిగ్ బాస్’ తర్వాత చాలా జరిగాయి. చాలా విషయాలు నా నియంత్రణలో లేవు. మేము చాలా ప్రయత్నించాము. కానీ చివరికి మేము మా జీవితాలను విడిగా గడపాలని నిర్ణయించుకున్నాము” అంటూ బ్రేకప్ విషయాన్ని వెల్లడించింది. వాలంటైన్స్ డే రోజు బ్రేకప్ వెరైటీనే మరి!
