ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభన్ ‘రాకాస’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా నయనర్ సారిక కనిపించనున్నారు. ప్రేమ, హాస్యం, ఫాంటసీ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ కథను అందించటంతో పాటు దర్శకత్వం వహించారు. ఆమె ముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు క్రియేటర్, రైటర్‌గా గుర్తింపు పొందారు. తర్వాత బెంచ్ లైఫ్ అనే ప్రాజెక్ట్‌ను కూడా డైరెక్ట్ చేశారు.
ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.
Also Read:Gopichand: ఆగిందనుకున్న సినిమా మళ్ళీ మొదలైంది
రాకాస సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సమయంలో ఈ లేటెస్ట్ డీల్‌తో ‘రాకాసా’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా.. ఓవర్‌సీస్‌లో మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్ షోలు 2026 ఏప్రిల్ 2న ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
