Site icon NTV Telugu

Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Rakasa Movie, Niharika Konidela,

Rakasa Movie, Niharika Konidela,

నిహారిక కొణిదెల.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి గుర్తింపు పొందలేక పోయింది. అంత పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలబడలేక పోయిం‌ది. దీంతో నిర్మాత గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘రాకాస’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్ నుంచి మరో ట్రీట్

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నయన్ సారిక హీరోయిన్‌గా.. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అంతే కాదు, ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. ఇదొక వినూత్నమైన ‘ఫాంటసీ కామెడీ డ్రామా’ అని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాలుగు రోజుల టాకీ పార్ట్ మరియు ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version