Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే

Super Star

Super Star

 సూపర్ స్టార్ రజనీకాంత్ 173 సినిమా అనౌన్స్ మెంట్ ఈ రోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ధర్మన్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ వేడుకలో రజనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పడు తమిళ మీడియాలో సంచలనంగా మారాయి.

రజని మాట్లాడుతూ “ఇటీవల నేను ఏది మాట్లాడిన సమస్య అవుతోంది. కొందరికి నేను మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఒకవేళ నేను నోరు విప్పకుండా మౌనంగా ఉంటే.. ఏంటి రజని నోరు మూతపడిందా, ఎందుకు మాట్లాడటం లేదని విమర్శిస్తారు. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే చూడండి రజనీ ఎలా మాట్లాడుతున్నాడో అని దాన్ని పట్టుకుని మరో కొత్త వివాదాన్ని సృష్టిస్తారు’ అని కాస్త ఘాటుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుండి విజయ్ ఫ్యాన్స్ రజనిపై టార్గెట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇండైరెక్ట్ గా వారినుద్దేశించి రజని ఇలా మాట్లాడారని ఒక టాక్ వినిపిస్తుంది.  ఇక కార్యక్రమం అనంతరం ‘మీరు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బర్త్ కి విష్ చేస్తూ ట్వీట్ చేయలేదని మీడియా ప్రశించగా ‘ నేను విజయ్ కు డైరెక్ట్ గా కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపానని బదులిచ్చారు సూపర్ స్టార్.

×
×
Ad