బాలీవుడ్‌లో అత్యంత క్యూటెస్ట్ మరియు లవ్లీ కపుల్‌గా పేరుపొందిన రాజ్‌కుమార్ రావు – పత్రలేఖ దంపతులు ఎట్టకేలకు తల్లిదండ్రులయ్యారు. వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. “దేవుడు మాకు ఒక చిన్న దేవదూతను ఇచ్చాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవానికే ఇదొక ప్రత్యేక గిఫ్ట్‌గా మారిందని వారు క్యాప్షన్‌లో తెలిపారు. వారి పోస్ట్‌కు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Chandini Chowdary: ఆ సీన్స్ చేయమంటూ నన్ను బలవంతం చేశారు..
రాజ్‌కుమార్–పత్రలేఖ జంట అనేక సంవత్సరాల ప్రేమ అనంతరం, 2021 నవంబర్ 15న చండీగఢ్‌లో సింపుల్ & ఎలిగెంట్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వారి కుటుంబంలోకి చిన్నారి రావడంతో అభిమానులు “డబుల్ హ్యాపీ మోమెంట్”గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇకపోతే, ఒక ఇంటర్వ్యూలో పత్రలేఖ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత సౌత్ న్యూజిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసినట్టు, అది చాలాకాలంగా వారి బకెట్‌లిస్ట్‌లో ఉందని చెప్పింది. అక్కడ బంగీ జంపింగ్ చేయడం, బేబీతో కలిసి ఎంజాయ్ చేసే యాడ్వెంచర్ యాక్టివిటీల్లో పాల్గొనడం తమ డ్రీమ్ అని కూడా వెల్లడించింది. ఇక సినిమాల విషయానికి వస్తే .. రాజ్‌కుమార్ రావు వరుస సినిమాలతో బిజీగా ఉండగా, పత్రలేఖ కూడా హీరోయిన్‌గా మరియు ముఖ్య పాత్రలతో సినిమాల్లో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
