Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్

Ganguly

Ganguly

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అగ్రెసివ్ కెప్టెన్లలో ఒకరైన ‘మహారాజా’ సౌరవ్ గంగూలీ. ఫాన్స్ ముద్దుగా దాదా అని పిలిచుకునే గంగూలీ పుట్టిన రోజు ఈరోజు. ఈ నేపథ్యంలో గంగూలీ బయోపిక్ దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. గంగూలీ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్, గంగూలీ పాత్రలో అచ్చుగుద్దినట్లు సరిపోయారు. క్రికెట్ హిస్టరీలోనే ఐకానిక్ మూమెంట్ అయిన లార్డ్స్ బాల్కనీలో జెర్సీ విప్పి గాల్లో ఊపిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ పోస్టర్‌లో అద్భుతంగా రీక్రియేట్ చేశారు.

 ఈ భారీ బయోపిక్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే స్క్రీన్ పైకి తీసుకురానున్నారు. ‘ట్రాప్డ్’ వంటి వైవిధ్యమైన చిత్రం తర్వాత రాజ్‌కుమార్ రావు – విక్రమాదిత్య కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గంగూలీ కోల్‌కతా వీధుల నుండి లార్డ్స్ గ్రౌండ్స్ వరకు, ఆపై ఇండియన్ క్రికెట్‌ను ఎలా మలుపు తిప్పారనే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్ మరియు డిబిఎల్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లాంగ్ హాలిడే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ 14 మే 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.