Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అగ్రెసివ్ కెప్టెన్లలో ఒకరైన ‘మహారాజా’ సౌరవ్ గంగూలీ. ఫాన్స్ ముద్దుగా దాదా అని పిలిచుకునే గంగూలీ పుట్టిన రోజు ఈరోజు. ఈ నేపథ్యంలో గంగూలీ బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. గంగూలీ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్, గంగూలీ పాత్రలో అచ్చుగుద్దినట్లు సరిపోయారు. క్రికెట్ హిస్టరీలోనే ఐకానిక్ మూమెంట్ అయిన లార్డ్స్ బాల్కనీలో జెర్సీ విప్పి గాల్లో ఊపిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ పోస్టర్లో అద్భుతంగా రీక్రియేట్ చేశారు.
ఈ భారీ బయోపిక్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే స్క్రీన్ పైకి తీసుకురానున్నారు. ‘ట్రాప్డ్’ వంటి వైవిధ్యమైన చిత్రం తర్వాత రాజ్‌కుమార్ రావు – విక్రమాదిత్య కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గంగూలీ కోల్‌కతా వీధుల నుండి లార్డ్స్ గ్రౌండ్స్ వరకు, ఆపై ఇండియన్ క్రికెట్‌ను ఎలా మలుపు తిప్పారనే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్ మరియు డిబిఎల్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లాంగ్ హాలిడే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ 14 మే 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!