Site icon NTV Telugu

Rajisha Vijayan: పెళ్ళికి రెడీ అయిన మరో హీరోయిన్.. అబ్బాయి ఎవరంటే?

Rajisha Vijayan

Rajisha Vijayan

Rajisha Vijayan to Marry Soon: ఈ మధ్య కాలంలో హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మన తెలుగమ్మాయిలు తక్కువే కానీ ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న వారు పెళ్లి చేసుకుని పప్పన్నం పెట్టేస్తున్నారు. ఇక ఆ లిస్టులో మరో హీరోయిన్ యాడ్ అయింది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు తెలుగమ్మాయిలాగానే కనిపించే రజిషా విజయన్. తమిళంలో కర్ణన్, జై భీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది నటి రజిషా విజయన్. ఆమె మొదటి తమిళ సినిమా కర్ణన్, 2021లో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తమిళ సినిమాల్లోకి రాకముందు మలయాళంలో బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్‌లో ఆమె కొన్ని సినిమాలు, సీరియల్స్ చేసింది. ఇక కొన్నాళ్లుగా నటి రజిషా విజయన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇస్తూ ఈ ఇద్దరూ జంటగా దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. దీంతో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రజిషా విజయన్ తెలుగులో మాస్ మాహారాజా రవితేజ జోడిగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించకున్నా తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న ఆమె సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించక పోయినా ఆ మధ్య ఇటీవలే టోబిన్ థామస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీరిద్దరి చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుందని అంటున్నారు.

Exit mobile version