Rajinikanth’s Lal Salaam Releasing with low buzz: రజనీకాంత్ హీరోగా నటించిన చివరి సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన ఏజ్ కి తగిన పాత్ర కావడంతో రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా పెద్దగా సౌండ్ లేకుండా రిలీజ్ కి రెడీ అయిపోతుంది. ఈ సినిమాని రజినీకాంత్ కుమార్తె ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసింది. నిజానికి ఈ సినిమాలో అసలు హీరో విష్ణు విశాల్. విక్రాంత్, జీవిత ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ ముంబై బేస్డ్ లోకల్ లీడర్ మోయీన్ భాయ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆయనది అతిథి పాత్ర అని ముందు నుంచి చెబుతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన పెద్దగా కనిపించలేదు.
Skanda VS Bhagavanth kesari: ఈ టీవీ ఆడియన్స్ ఉన్నారే.. ఒక పట్టాన అర్ధం కారనుకో!
ఇక ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని ఆ స్పోర్ట్స్ కి రాజకీయాలు ఎలా లింక్ పొయ్యాయి అనే ఆసక్తికరమైన కదాంశంతో తెరకెక్కించారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి అండర్ డాగ్ లాగా ఉంచాలని, కావాలని బజ్ క్రియేట్ చేయడం లేదో ఏమో తెలియదు కానీ రేపు రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. తెలుగు వెర్షన్ లైట్ తీసుకున్నారంటే అనుకోవచ్చు, తమిళ వర్షన్ ప్రమోషన్స్ కూడా పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇక తెలుగు విషయానికొస్తే ఈ సినిమా రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈగల్ సినిమాకి రవితేజ అండ్ టీం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తుంటే లాల్ సలాం టీం మాత్రం ఎందుకో సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేస్తుంది. సినిమా ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది దానికి తోడు రెహమాన్ సంగీతం అందించిన కొన్ని సాంగ్స్ కూడా బాగుండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో కాస్త అంచనాలు ఉన్నాయి. కానీ ఎందుకో ప్రమోషన్స్ విషయంలో సినిమా యూనిట్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.