Site icon NTV Telugu

Jailer: ముత్తువేల్ పాండియన్ వస్తున్నాడు…

Jailer First Look

Jailer First Look

మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘జైలర్’ మూవీ కోసం తలైవ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజు సంధర్భంగా ‘జైలర్’ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకి ‘ముత్తువేల్ పాండియన్’ వస్తున్నాడు అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘జైలర్’ నుంచి రజినీకాంత్ లుక్ ఇప్పటికే బయటకి వచ్చినా అవి ఫోటోషూట్ నుంచి రిలీజ్ చేసినవి కాబట్టి ఫాన్స్ కి అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. ఈసారి బర్త్ డే గిఫ్ట్ గా రజినీకాంత్ జైలర్ లుక్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే రజినీకాంత్ పుట్టిన రోజు సంధర్భంగా, ఎదో ఒక ప్రొడక్షన్ హౌజ్ నుంచి కొత్త సినిమా అప్డేట్ వస్తుంది కానీ రజినీకాంత్ కొత్త సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇదే మొదటిసారి. రజినీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ‘పేట’ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, మురుగదాస్ లలో ఒకరితో రజినీకాంత్ తదుపరి సినిమా ఉండే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది కానీ ఈ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

Exit mobile version