Site icon NTV Telugu

Rajinikanth: చంద్రబాబు నాయుడుని జైలులో కలవాల్సి ఉంది కానీ…

Rajinikanth

Rajinikanth

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఒకవైపు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరుతూ ఉంటే మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడుని జైలులో కలుస్తాడు అనే వార్త వినిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న ఈ న్యూస్ కి రజినీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. “చంద్రబాబు నాయుడుని కలవాల్సి ఉంది కానీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా కుదరలేదు. కోయంబత్తూర్ లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అందుకే కలవలేదు” అంటూ రజినీ చెప్పాడు. మరి ఫ్యామిలీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రజినీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడుని కలుస్తాడేమో చూడాలి.

Read Also: Jr NTR: చంద్రబాబు అరెస్ట్… సైమా వేదికపై ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

Exit mobile version