NTV Telugu Site icon

Rajinikanth: సూపర్ స్టార్ లుక్ మార్చాడు… జైలర్ కన్నా స్టైలిష్ గా ఉన్నాడు

Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రజినీ పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసే రేంజ్ హిట్ కొట్టిన రజినీకాంత్, తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. రజినీ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు, పైగా నెల్సన్ లాంటి డైరెక్టర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఎవరూ అనుకోని ఉండరు. వంద రెండు వందలు కాదు ఏకంగా 650 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు రజినీకాంత్. జైలర్ గా రజినీకాంత్ చూపించిన రెండు వేరియేషన్స్ ఆడియన్స్ కి మోడరన్ భాషా సినిమాని గుర్తు చేసాయి. రజినీకాంత్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు అనిరుధ్ డ్యూటీ ఎక్కడంతో థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు వచ్చాయి.

జైలర్ సినిమా ఫస్ట్ 40 మినిట్స్ ఒక రేంజులో ఉంటే మిగిలిన సినిమా అంతా ఇంకో రేంజులో ఉంటుంది. తన చరిష్మాకి తగ్గ పాత్ర చేసిన రజినీకాంత్… మరోసారి పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు. జై భీమ్ లాంటి సెన్సేషనల్ డ్రామాతో ఆడియన్స్ ని మెప్పించిన జ్ఞానవేల్ తో రజినీ 170వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫజిల్, రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ఒక ఎంకౌంటర్ లో ట్రయల్స్ ఫేస్ చేస్తున్న సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ గా రజినీ కనిపించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటూ మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్ కొత్త లుక్ తో మాస్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జైలర్ లో కన్నా తలైవర్ 170 సినిమా లుక్ లో రజినీకాంత్ ఇంకా బాగున్నాడు. మరి తలైవర్ 170 ఫస్ట్ లుక్ ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.