Site icon NTV Telugu

Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!

Jailar 2

Jailar 2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్‌లో యోగిబాబు కమెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా ఎంటర్ అయారట..

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు సంతానం ‘జైలర్ 2’ టీమ్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ఆయన సెట్స్‌పై పాల్గొన్నారట. యోగిబాబు – సంతానం కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించబోతోందన్న వార్తతోనే అభిమానుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. నెల్సన్ స్టైల్ ఫన్, రజినీ ఎనర్జీ, ఈ ఇద్దరు కమెడియన్ల టైమింగ్ ఇవన్నీ కలిస్తే మరింత నవ్వుల వర్షం కురుస్తుండడంతో సందేహం లేదు. అనిరుద్ కంపోజ్ చేస్తున్న మ్యూజిక్, సన్ పిక్చర్స్ భారీ నిర్మాణం ఈ ప్రాజెక్ట్‌కు మరింత హంగులు అద్దనున్నాయి.

Exit mobile version