NTV Telugu Site icon

Jailer: పోనిలే… ఇప్పటికైనా ప్రమోషన్స్ చెయ్యాలి అనే విషయం గుర్తొచ్చింది

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేసే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా జైలర్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో ఎవరికీ అంతుబట్టని విషయంగా ఉంది. రజినీకాంత్ మాత్రమే కాదు జైలర్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు.

సౌత్ మార్కెట్ నే కదిలించగల సత్తా ఉన్న ముగ్గురు సూపర్ స్టార్ హీరోలని జైలర్ సినిమాలో పెట్టుకుంటే చాలు, బజ్ వస్తుంది అని మేకర్స్ భావిస్తున్నట్లు ఉన్నారు. అలా అనుకుంటే అదే మేకర్స్ చేసే అతిపెద్ద పొరపాటు. రజిని ఫాన్స్ కూడా జైలర్ అప్డేట్ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇంకా లేట్ చేస్తే తెలుగులో కనీసం చెప్పుకునే స్థాయి థియేటర్స్ కూడా దొరికే పరిస్థితి కనిపించట్లేదు. పైగా ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. చిరు ముందు థియేటర్స్ సొంతం చేసుకోవడం జైలర్ కి కాస్త కష్టమైన పనే. లేటెస్ట్ గా జైలర్ నుంచి ఫస్ట్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడి నుంచైనా జైలర్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేసి మేకర్స్ కాస్త హైప్ పెంచుతారేమో చూడాలి.

Show comments