సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ చిరు, కమల్ లాంటి స్టార్ హీరోల కంబ్యాక్ చూసాం కానీ ఈ రేంజ్ కంబ్యాక్ ని ఇండియన్ సినిమా చూసి ఉండదు. రెండున్నర రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్, మూడు రోజుల్లో 200 కోట్ల కలెక్షన్, ఇంకా మిగిలిన సండే, మండే ఒక్క రోజు వదిలేస్తే ఆ వెంటనే వచ్చే ఇండిపెండెన్స్ డే హాలిడే… రజినీ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచనలం ఊహిస్తేనే ఎన్ని రికార్డులకి ఎండ్ కార్డ్ పడబోతుందో అనిపిస్తోంది. సరిగ్గా పది రోజుల క్రితం వరకూ జైలర్ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. తలైవర్ అభిమానులు కూడా జైలర్ ప్రమోషన్స్ చెయ్యండ్రా బాబు అని మేకర్స్ ని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు.
తీరా రిలీజ్ డేట్ వచ్చే సరికి ఒక ట్రైలర్, హుకుమ్ సాంగ్, రజినీకాంత్ స్పీచ్… జైలర్ సినిమాకి ఎక్కడా లేని బజ్ ని జనరేట్ చేసాయి. కబాలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని జైలర్ రాబడుతుంది అంటే జైలర్ ఆడియో లాంచ్ అభిమానులపై ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. బిగ్గెస్ట్ సండే కలెక్షన్స్ ని చూడబోతున్న జైలర్ సినిమా, డే 1 రేంజులో 4వ రోజు కలెక్షన్స్ ఉండనున్నాయి. ఇదే జరిగితే సెన్సేషన్ క్రియేట్ అయినట్లే. ఓవరాల్ గా ఇప్పుడున్న బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తే జైలర్ సినిమా మొదటి వారం ఎండ్ అయ్యే సమయానికి 500 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో జైలర్ ఎంత వరకూ కలెక్ట్ చేస్తుంది అనేది పూర్తిగా తలైవర్ అభిమానుల చేతిలో ఉన్న విషయం.
