సూపర్ స్టార్ రజినీకాంత్ కి అయిదేళ్లుగా సరైన హిట్ లేదు, పదేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ అనే మాటే లేదు. ఎన్ని సినిమాలు చేసినా, మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో చేసినా హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో హిట్ లోటుని తీరుస్తూ జైలర్ సినిమా బయటకి వచ్చింది. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ హావోక్ క్రియేట్ చేస్తున్నాడు. కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో రజినీకాంత్ హవా స్టార్ట్ అయ్యింది. జైలర్ ఆడియో లాంచ్ లో “కాకీ-గ్రద్ద” కథ చెప్పి అర్ధం అయ్యిందా రాజా అని మాట్లాడిన రజినీకాంత్, ఇప్పుడు తన రేంజ్ ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసాడు. మొదటి రోజు జైలర్ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల ఓపెనింగ్ ని రాబట్టి 2023లో ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో మూడో స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్, సెకండ్ ప్లేస్ లో పఠాన్ సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ ఖాతాలో అయితే జైలర్ బిగ్గెస్ట్ ఓపెనర్.
ఇంతకూ ముందున్న రికార్డ్స్ అన్నింటినీ రజినీకాంత్ చెల్లా చెదురు చూస్తున్నాడు. గురువారం కలెక్షన్స్ ఈ రేంజులో ఉంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంకే రేంజులో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ విపరీతమైన పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో జైలర్ కలెక్షన్స్ మరింత పెరుగుతాయి కానీ తగ్గే అవకాశమే లేదు. యుఎస్ఏ మార్కెట్ లో 1.4 మిలియన్ డాలర్లని రాబట్టిన జైలర్, విజయ్ నటించిన బెస్ట్ లైఫ్ టైం కలెక్షన్స్ ని ఒక్క రోజులో బ్రేక్ చేసింది. ఓవరాల్ గా అన్ని సెంటర్స్ లో జైలర్ సినిమా మొదటి రోజే 55% బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ వీకెండ్ అయ్యే సమయానికి జైలర్ ఆల్ సెంటర్స్ లో 80% రికవరీ చేసేయడం గ్యారెంటీ.
