NTV Telugu Site icon

Rajinikanth: ఆ క్రేజ్ ఏంటి సామీ… నువ్వు నిజంగానే ఇండియన్ సినిమా బాద్షా

Rajinikanth

Rajinikanth

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించిన మీనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఇయర్స్ అయిన సంధర్భంగా… ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల మధ్యలో 40 ఇయర్స్ ఆఫ్ మీనా సెలెబ్రేషన్స్ చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్, రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యారు. మాములుగా అయితే ఈ ఈవెంట్ ఒక సన్మాన సభగా కంప్లీట్ అయిపోవాలి కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఉండడంతో మీనా సన్మాన సభ కాస్త రజినీకాంత్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఖుష్బు, రోజా, మీనాలు స్టేజ్ పై మాట్లాడుతూ ఉండగా… ఆడిటోరియంలో ఒక్కసారి అరుపులు, కేకలు, విజిల్స్ వినిపించాయి. అంతే అప్పటివరకూ స్టేజ్ పై మాట్లాడుతున్న వారిని చూస్తున్న వాళ్లందరూ ఎంట్రెన్స్ వైపు తల తిప్పారు.

బోణీ కపూర్ నుంచి ప్రభుదేవా వరకూ ప్రతి ఒక్కరు ఎంట్రెన్స్ వైపు లుక్ వేశారు. అప్పుడు ఎంటర్ అయ్యింది రజినీకాంత్ కార్, విజిల్స్ ఇంకా కాస్త ఎక్కువగా వినిపించాయి. కార్ దిగి ఆడిటోరియం లోపలకి వచ్చి రజినీకాంత్ కూర్చునే వరకూ ఆ విజిల్స్ సౌండ్ తగ్గలేదు, రజినీకాంత్ అభిమానుల హంగామా సైలెంట్ అవ్వలేదు. సైలెంట్ గా ఉన్న ఆడిటోరియంలో షాక్ వేవ్స్ తెప్పించిన రజినీ ఎంట్రీకి అక్కడ ఉన్న ప్రతి సెలబ్రిటి నోరెళ్ళబెట్టి చూశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో దాదాపు మూడు నిమిషాల నిడివితో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తలైవర్ మరణ మాస్ ఎంట్రీ అంటూ ఆ వీడియోని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం రజినీకాంత్ ఎంట్రీ వీడియోని చూసి షేర్ చేస్తున్నారు. ఆ క్రేజ్, ఇమేజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాత్రమే చెల్లింది. అందుకే ఆయన్ని అందరూ ఏకైక సూపర్ స్టార్ అంటుంటారు.

Show comments