Site icon NTV Telugu

ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. ఆనందంలో అభిమానులు

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల జనరల్ చెకప్ కోసం కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీ నాలుగు రోజులు అన్ని టెస్టులు చేయించుకొని తాజాగా ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఇక రజినీకాంత్ డిశ్చార్జ్ కావడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజినీ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న గా విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version