Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు గానే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఈడియోను రిలీజ్ చేశారు. ఇందులో రజినీకాంత్ లుక్ ను చూపించారు. అలాగే నాగార్జున విజిల్ వేస్తున్న సీన్ ను చూపించారు.
Read Also : Samantha : అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటించట్లేదు..
ఇందులో కింగ్ నాగార్జున స్పెషల్ పాత్రలో మెరుస్తున్నారు. అలాగే శృతిహాసన్, పూజాహెగ్డే హీరోయిన్లుగా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. జైలర్ తో భారీ హిట్ అందుకున్న రజినీకాంత్.. వరుస హిట్లతో జోరు మీదున్న లోకేష్.. ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రజినీకాంత్ పూర్తి ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Pawankalyan : వీరమల్లుకు కొత్త చిక్కులు.. వాళ్లతో పోటీ తప్పదా..?
