Rajinikanth : రజినీకాంత్ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు – అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సూపర్‌స్టార్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రజినీకాంత్. సాధారణ కుటుంబంలో పుట్టి, బస్ కండక్టర్‌గా పని చేస్తూ ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం, సినీ రంగంలో సగర్వంగా నిలిచారు. తన ప్రత్యేకమైన నటన, అద్భుతమైన స్టైల్, మాస్స్ అప్పీల్, క్లాస్ టచ్ కలిపి రజనీకాంత్ ఒక లివింగ్ లెజెండ్‌గా నిలిచారు. ఒకవైపు యాక్షన్ హీరోగా, మరోవైపు హాస్యంతో, సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు సరిహద్దులు లేవు. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుని అభిమాన హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఇక తాజాగా ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకోన్నారు. ఇది కేవలం ఒక స్టార్‌కి మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినీ ప్రపంచానికి ఒక గర్వకారణం అని చెప్పాలి.
Also Read :Krishnashtami 2025 : ఆగస్టు 15, 16.. ఈసారి కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరుపుకునే ప్రత్యేకత ఇదే!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఐదు దశాబ్దాల ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆయన కేవలం నటుడిగానే కాకుండా, ఓ ప్రేరణాత్మక వ్యక్తిత్వంగా, సింప్లిసిటీతో అందరికీ ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్ కృషి నిజంగా విశేషం. ఆయన నటనలోని వైవిధ్యం, కష్టపడి సాధించిన స్థానమే ఆయనను లెజెండ్‌గా నిలిపాయి. ఇక ఈ అరుదైన విజయోత్సవ సందర్భంలో రజనీకాంత్‌కి సెలబ్రెటిలు, రాజకీయ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ ద్యారా శుభకాక్షలు తెలిపారు.. ‘సూపర్ స్టార్ థలైవా రజనీకాంత్ గారికి సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. మీ అభినయం, స్టైల్, విభిన్న పాత్రలతో తరతరాల ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సినీ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. ఇకపై కూడా ఆరోగ్యం, ఆనందం కలిగిన దీర్ఘాయుష్షుతో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?