Site icon NTV Telugu

Rajinikanth : రజినీకాంత్ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు – అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

Rajinikantha

Rajinikantha

భారతీయ సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రజినీకాంత్. సాధారణ కుటుంబంలో పుట్టి, బస్‌ కండక్టర్‌గా పని చేస్తూ ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం, సినీ రంగంలో సగర్వంగా నిలిచారు. తన ప్రత్యేకమైన నటన, అద్భుతమైన స్టైల్‌, మాస్స్‌ అప్పీల్‌, క్లాస్‌ టచ్‌ కలిపి రజనీకాంత్‌‌ ఒక లివింగ్‌ లెజెండ్‌గా నిలిచారు. ఒకవైపు యాక్షన్‌ హీరోగా, మరోవైపు హాస్యంతో, సీరియస్‌ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు సరిహద్దులు లేవు. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుని అభిమాన హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఇక తాజాగా ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్ల‌ు పూర్తి చేసుకోన్నారు. ఇది కేవలం ఒక స్టార్‌కి మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినీ ప్రపంచానికి ఒక గర్వకారణం అని చెప్పాలి.

Also Read :Krishnashtami 2025 : ఆగస్టు 15, 16.. ఈసారి కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరుపుకునే ప్రత్యేకత ఇదే!

ఐదు దశాబ్దాల ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆయన కేవలం నటుడిగానే కాకుండా, ఓ ప్రేరణాత్మక వ్యక్తిత్వంగా, సింప్లిసిటీతో అందరికీ ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్ కృషి నిజంగా విశేషం. ఆయన నటనలోని వైవిధ్యం, కష్టపడి సాధించిన స్థానమే ఆయనను లెజెండ్‌గా నిలిపాయి. ఇక ఈ అరుదైన విజయోత్సవ సందర్భంలో రజనీకాంత్‌కి సెలబ్రెటిలు, రాజకీయ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ ద్యారా శుభకాక్షలు తెలిపారు.. ‘సూపర్‌ స్టార్‌ థలైవా రజనీకాంత్ గారికి సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. మీ అభినయం, స్టైల్‌, విభిన్న పాత్రలతో తరతరాల ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సినీ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. ఇకపై కూడా ఆరోగ్యం, ఆనందం కలిగిన దీర్ఘాయుష్షుతో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

Exit mobile version