NTV Telugu Site icon

ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్

rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పాపులర్ స్టార్ కు నిన్న సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, కూతురు సౌందర్య, అల్లుడు విశాఖన్, మనవళ్లు యాత్ర ధనుష్, వేద్ కృష్ణ, అనిరుధ్ తండ్రి రవిచందర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

Read Also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే… రజనీకాంత్ హీరోగా సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా ‘అన్నాత్తే’ దీపావళికి విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ ఆయనతో నెక్స్ట్ చేయబోయే దర్శకుల లిస్ట్ లో చాలామంది పేర్లు వినబడుతున్నాయి. మరి రజినీకాంత్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.