Site icon NTV Telugu

Thalaivar 170: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అప్డేట్…

Thalaivar 170

Thalaivar 170

సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 12న పండగ చేసుకునే ఫ్యాన్స్ కి తలైవర్ 170 సినిమా నుంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈరోజు ఈవెనింగ్ తలైవర్ 170 మూవీ నుంచి రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ వీడియో బయటకి రానుంది. ఈ అప్డేట్ ని తలైవర్ 170 మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. లైకా ప్రొడక్షన్స్ తలైవర్ 170 సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా… జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో రజినీకాంత్ సస్పెన్షన్ లో ఉన్న పోలీస్ గా కనిపిస్తాడని సమాచారం. జైలర్ సినిమాలో రిటైర్డ్ జైలర్ గా కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్… తలైవర్ 170లో ఒక ఎంకౌంటర్ లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట.

Read Also: Hanuman: సూపర్ హీరో సినిమా ట్రైలర్ వస్తుంది…

ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. అయితే జ్ఞానవేల్ కాబట్టి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా కొత్త కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. టీజే జ్ఞానవేల్ ఒక మంచి సినిమాని ఇవ్వగలడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. మరి ఆ నమ్మకాన్ని డైరెక్టర్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడు? టీజర్ తో తలైవర్ ఫ్యాన్స్ ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తాడు అనేది చూడాలి.

Exit mobile version