సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి భాషా రోజులని గుర్తు చేస్తుంది జైలర్ ట్రైలర్. నెల్సన్ డైరెక్షన్ లో రజిని నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ట్రైలర్ రిలీజ్ వరకూ అంతంతమాత్రంగానే ఉన్న హైప్, ట్రైలర్ బయటకి రావడంతో ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. గత అయిదారు ఏళ్లలో రజినీ సినిమాకి ఈ రేంజ్ బజ్ జనరేట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటే జైలర్ ట్రైలర్ ఎంతగా ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా జైలర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అసలు అంచనాలు లేని చోట జైలర్ ట్రైలర్ ఒక హోప్ క్రియేట్ చేసింది. మేకర్స్ కాస్త ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేయడానికి ముందుకి వస్తే హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ నటించినా కూడా మేకర్స్ వారిని ట్రైలర్ లో కనిపించకుండా చేసారు. వీరికి సంబందించిన ప్రమోషనల్ కంటెంట్ ని కూడా రిలీజ్ చేస్తే కన్నడ, మలయాళ భాషల్లో జైలర్ సినిమాపై హైప్ పెరుగుతుంది. తెలుగులో రజినీ సినిమాకి ఎలాగూ మంచి ఓపెనింగ్స్ వస్తాయి, అవి మరింత పెరగాలి అంటే రజినీ ఇక్కడికి రావాలి. హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ లా చేస్తే, దానికి రజినీ హైదరాబాద్ వచ్చి స్టేజ్ పైన మాట్లాడితే చాలు జైలర్ సినిమా ప్రీబుకింగ్స్ లో జోష్ కనిపిస్తుంది. మరి ఇటీవలే చెన్నైలో ఆడియో లాంచ్ చేసిన జైలర్ టీమ్, హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏమైన ప్లాన్ చేస్తారేమో చూడాలి. రిలీజ్ కి ఇంకా అయిదు రోజుల సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో స్పీడ్ ని ఎంత పెంచితే, ఎంత జోష్ చూపిస్తే అంట ఎక్కువ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ.
