NTV Telugu Site icon

Rajini Kanth: మ్యూజిక్ మాస్ట్రో కు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్

Rajini

Rajini

సూపర్ స్టార్ రజినీకాంత్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ల మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 28 ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఫేవరేట్ సంగీత దర్శకుడు ఎవరు అంటే.. టక్కున ఇళయరాజా అని ఎవరైనా చెప్పేస్తారు. రజినీకి సూపర్ హిట్స్ ఇచ్చిన ఇళయరాజా కు కూడా ఆయనంటే అమితమైన ప్రేమ. ఇటీవల ఈ ఇద్దరు లెజెండ్స్ పోయెస్ గార్డెన్స్ లో భేటీ అయినా విషయం విదితమే.

ఇక తాజాగా సంగీత జ్ఞాని ఇళయరాజాను కేంద్రం రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న ఇళయరాజా అభిమానులు, పలువురు ప్రముఖులు ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రజినీకాంత్ కూడా తన స్నేహితుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “రాజ్యసభ సభ్యునిగా నియమితులైన నా ప్రియ మిత్రుడు, సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారికి నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments