Site icon NTV Telugu

Rajini: అప్పుడే 4 మిలియన్ మార్క్… కేవలం ఓవర్సీస్ లోనే 100 కోట్లు

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ తన సుప్రిమసీని చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. 45 ఏళ్లుగా తన పని అయిపొయింది అనుకున్న ప్రతిసారీ “ఐ యామ్ నాట్ డన్ ఎట్” అని రీసౌండ్ వచ్చేలా చెప్తూ వచ్చిన రజినీ, ఈసారి జైలర్ సినిమాతో నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్నాడు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో రజినీకాంత్ రాబడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా స్టన్ అవుతున్నారు. ఎవరు స్టార్ అయినా, ఎంత పెద్ద హిట్ కొట్టినా రజినీని దాటలేరు అనే విషయం అందరికీ క్లియర్ గా అర్ధం అయ్యేలా చేస్తుంది జైలర్ సినిమా. ముఖ్యంగా జైలర్ మూవీ ఓవర్సీస్ లో రాబడుతున్న బుకింగ్స్ ని మెంటల్ ఎక్కిపోవాల్సిందే. కేవలం అమెరికాలోనే జైలర్ సినిమా 4 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. ఇంకా సండే ఉంది కాబట్టి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైమ్ కి జైలర్ సినిమా యుఎస్ఏలోనే 4.5 మిలియన్ డాలర్స్ వరకూ రాబట్టడం గ్యారెంటీ.

రజినీకాంత్ కంబ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఫీనిక్స్ పక్షిలా ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు. మిడిల్ ఈస్ట్ లో కూడా జైలర్ బుకింగ్స్ బీస్ట్ మోడ్ లో ఉన్నాయి. అన్ని ఓవర్సీస్ సెంటర్స్ లో కలిపి జైలర్ సినిమా దాదాపు 9 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 70 కోట్లు. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిస్తే జైలర్ సినిమా కేవలం ఓవర్సీస్ లోనే 100 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుంది. జైలర్ ని ఇమ్మిడియట్ గా ఉన్న టార్గెట్ కబాలి… 4.5 మిలియన్ డాలర్స్ తో కబాలి సినిమా జైలర్ కన్నా ముందు ఉంది. ఈరోజు ముగిసే సరికి కబాలి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. కోలీవుడ్ నుంచి పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ అమెరికాలో 8.1 మిలియన్ డాలర్స్ ని రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. రజినీ జైలర్ సినిమాతో లాంగ్ రన్ ని మైంటైన్ చేస్తే పొన్నియిన్ సెల్వన్ రికార్డ్స్ ని టార్గెట్ చేయడం గ్యారెంటీ. ఇదే జరిగితే రజినీకాంత్ మరో పదేళ్ల పాటు హిట్ కొట్టకపోయినా ఎవరు నోరుమొదపలేరు

Exit mobile version