Rajendra Prasad Shares her Dasara Experience in Suma ADDA: రాజేంద్రప్రసాద్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో ఎక్కువగా కామెడీ సినిమాలే చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ `సుమ అడ్డా`లో దసరా స్పెషల్ కార్యక్రమంలో సందడి చేశారు. కృష్ణారామా సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఆ సినిమాలో నటించిన సీనియర్ నటి గౌతమి, డైరెక్టర్ రాజు మదిరాజు, రచ్చ రవితో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో సుమతో కలిసి వారు సందడి చేశారు. ఇక తాజాగా ఈ `సుమ అడ్డా` ప్రోమో విడుదలవగా చివర్లో కన్నీళ్లు పెట్టించేలా సాగింది. ఇక ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి.
Mee Kadupuninda: ‘మీ కడుపునిండా’ తినండి అంటున్న ఆర్కే రోజా!
తాను చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు ఎలాంటివో ఆయన బయటపెట్టారు. ఎప్పుడూ నవ్వించే ఆయన కంటతడి పెట్టించారనే చెప్పాలి. చిన్నప్పుడు దసరా పండగని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్లో తమ అనుభవాలను పంచుకోవాలని యాంకర్ సుమ కోరగా అందుకు రాజేంద్రప్రసాద్ చిన్నప్పుడే తన అమ్మ చనిపోయిందని చెప్పారు. అంతేకాదు తాను మూడు నెలలు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్‌కి వెళ్లానని, తాను చనిపోయే స్థితికి చేరుకున్నప్పుడు కనక దుర్గ గుడికి తీసుకెళ్లి ఒరేయ్ ఇక ఇంటి దగ్గర అమ్మ ఉండదుగా, ఇక్కడే మీ అమ్మ ఉంటుంది అని చెప్పారని అన్నారు. ఇక కనకదుర్గమ్మనే అమ్మగా భావించిన పెరిగినట్టుగా రాజేంద్రప్రసాద్ చెప్పడం గమనార్హం. రాజేంద్రప్రసాద్ నట ప్రస్థానంలో మూడు వందలకుపైగా సినిమాల్లో నటించారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో కనిపించారు.