Site icon NTV Telugu

Love Otp : ‘లవ్ ఓటీపీ’ అందరూ చూడాల్సిన మూవీ.. రాజీవ్ కనకాల

Love Otp

Love Otp

Love Otp : లవ్ ఓటీపీ సినిమా అందరూ చూసే విధంగా ఉంటుందన్నారు నటుడు రాజీవ్ కనకాల. అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ సినిమాను విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఇందులో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈవెంట్ లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ చేసినట్టు తెలిపాడు.

Read Also : Anupama : దాని వల్ల తట్టుకోలేకపోయా.. అనుపమ ఎమోషనల్

‘‘లవ్ ఓటీపీ’ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో నేను తండ్రి పాత్ర పోషించా. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. అనీష్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జాన్వికకి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆనంద్ కు రోషన్ చిత్రాలకు మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇస్తాను. రాజమౌళిలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టున్న అనీష్‌కు మంచి పేరు రావాలి. అతను హీరోగా, డైరెక్టర్ గా రాణించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు రాజీవ్ కనకాల.

హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ .. చాలా కాలంగా హీరో కావాలని కలలు కన్నాను. ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా ఉంది. తెలుగులోకి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ సినిమాతో తీరిపోయింది. మేం కంటెంట్‌ను నమ్మి ఈ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సపోర్టు మర్చిపోలేం. ఈ సినిమాను అందరూ ఆదరించండి అని కోరారు.

Read Also : Pawan Kalyan: వైద్య సేవలో నిర్లక్ష్యంగా ఉండకండి.. డిప్యూటీ సీఎం సిరీస్..!

Exit mobile version