టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్య ఆకర్షణగా నిలిచేది విలన్ పాత్రే అంటా. కాగా ఈ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ ను ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. కాగా ఆయన లుక్ పూర్తిగా కొత్తగా, భిన్నంగా రూపొందించబడ్డట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లోనే శక్తిమంతమైన పాత్రగా ఉండనుంది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందట. చిత్ర దర్శకుడు రాజశేఖర్ పాత్రను పునరావిష్కరించి, గతంలో ప్రేక్షకులు చూడని విధంగా రూపొందించినట్లు తెలిసింది.
సినిమా కధ గ్రామీణ నేపథ్యం తో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రాజకీయ అంశాలు కూడా కీలకంగా ఉంటాయని, కథలో కథానాయకుడు విజయ్ దేవరకొండ ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తుందట. కథలో విలన్ పాత్ర ప్రధానమైనది కాబట్టి, రాజశేఖర్ క్యారెక్టర్ మైండ్ల్ బ్లోవింగ్‌గా రూపొందించబడినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తన గ్లామర్, నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సినిమాకు బలాన్ని చేకూరుస్తారని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి, ‘రౌడీ జనార్దన్’ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రత్యేకంగా రాజశేఖర్ కొత్త లుక్, విజయ్ దేవరకొండ ఎమోషనల్ యాక్షన్, కీర్తి సురేష్ నటన సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే షూటింగ్, లేట్ 2025 లేదా 2026 మధ్య రిలీజ్ క్రమంలో అభిమానులను తెర పై కొత్త సక్సెస్ స్టోరీగా ఎదురుచూస్తున్నట్లు ఉంది.
