NTV Telugu Site icon

The RajaSaab : చివరిదశ షూటింగ్ లో రాజాసాబ్.. రిలీజ్ డౌటే..?

Raajaasaab

Raajaasaab

ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే.. వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్‌, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.

Also Read : Divya Bharathi : కన్యా రాశి కలువ..’ దివ్య భారతి’ వయ్యారాలు బరవా

కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్‌’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అంటే రిలీజ్ కు కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. అసలు అనుకున్న టైమ్ కు వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఇదిలా ఉండగా విశ్వనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 10 శాతం టాకీ పోర్షన్ పెండింగ్ లో ఉంది. అలాగే 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలారు. టీజర్ తర్వాత దర్శకుడు మారుతి వర్క్ తో పాటుగా సినిమా గురించి కూడా గట్టిగా మాట్లాడుకుంటారని సమాచారం. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ పోర్షన్ ఉందని దానికే ఎక్కవ టైమ్ పడుతుందని ఏప్రిల్ రిలీజ్ డౌట్ అనే టాక్ నడుస్తుంది.