Rajamouli: సలార్ ఇంకా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. అసలు పండగ మొదలుపెట్టేశారు కూడా. కెజిఎఫ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళితో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విషయాలను పంచుకున్నారు. ఇక సలార్ లోప్రభాస్- శృతి హాసన్ కు మధ్య ఒక్క డ్యూయెట్ కూడా లేదు అని చెప్పడంతో రాజమౌళి అప్సెట్ అయ్యానని చెప్పుకొచ్చాడు. “శృతిహాసన్ రెండు సాంగ్స్ తనకు చాలా ఇష్టం. ఒకటి రేసుగుర్రం సాంగ్.. ఇంకోటి చారుశీల సాంగ్. అలాంటిది సలార్ లో ఆమెతో ఎలాంటి డ్యూయెట్ లేదా ప్రభాస్ తో కలిసి ఒక సాంగ్ పెట్టలేదు.. నేను అప్సెట్ అయ్యాను అని రాజమౌళి అనగా.. దానికి ప్రశాంత్ నీల్ ఆన్సర్ ఇస్తూ.. ” సినిమాలో శృతి హాసన్ కూడా కథలో భాగం. వరల్డ్ సినిమా తన పంథా మార్చుకుంది.. అందుకే ఈ సినిమాలో డ్యూయెట్ లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
