Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాను ఇచ్చింది రాజమౌళి. మగధీర సినిమాతో వీరి మధ్య స్నేహ బంధం మొదలయ్యింది. ఇక ఈ సినిమా తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ కాంబో రిపీట్ అయ్యింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది అంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అవార్డును గెలుచుకుంటుందా అని భారతీయులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్కార్ ను పక్కన పెడితే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను ఆర్ఆర్ఆర్ కైవసం చేసుకొంది. ఇద్దరు స్టార్ హీరోలను సమానంగా నిలబెట్టడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమైన పని. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
ఇక తాను చరణ్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల మీడియాతో ఆయన మాట్లాడుతూ .. “చరణ్, సుకుమార్‌లు త్వరలో చేయబోయే సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఆ చిత్రం ప్రారంభ సన్నివేశాన్ని చరణ్ నాకు వివరించాడు.. నేను నిజంగా ఆ సన్నివేశాన్ని ఇష్టపడ్డాను. వారిద్దరూ మళ్లీ జత కట్టి త్వరలో ఆ సినిమా చేస్తారని ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్- చరణ్ కాంబోలో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. రా అండ్ రస్టిక్ లుక్ లో చరణ్ కనిపించి మెప్పించాడు.. దీనికి సీక్వెల్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? లేక కొత్త కథతో రాబోతున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.
