NTV Telugu Site icon

SS Rajamouli: ఓకే రూములో ఏఎన్ఆర్, రాజమౌళి.. ఆ రహస్యం చెప్పారన్న జక్కన్న!

Rajamouli On Anr

Rajamouli On Anr

Rajamouli Speech at Akkineni Nageswara Rao statue Launch: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు కుటుంబ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరిట స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక దిగ్గజం రాజమౌళి అక్కినేని నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాన్ని అనుభూతులను పంచుకున్నారు. నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆయనను ఆరాధించానని పేర్కొన్న రాజమౌళి, వ్యక్తిగతంగా ఆయనతో నాకు పరిచయం తక్కువనీ అన్నారు. ఓ అవార్డు వేడుకకు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే రూములో కాసేపు సమయం గడిపే అవకాశం దక్కింది. అప్పుడు ఆయన కొన్ని అమూల్యమైన విషయాలు పంచుకున్నారు. అప్పుడు ‘దేవదాసు’ తర్వాత ‘మిస్సమ్మ’లో కమెడియన్ రోల్ ఎందుకు చేశారని అడిగానని అప్పుడు ఆయన నా అంతట నేను అడిగి చేసిన పాత్ర అని అన్నారు.

Navdeep: హైకోర్టులో నవదీప్ కి షాక్.. అరెస్ట్ తప్పదా?

నాగిరెడ్డి, చక్రపాణి నాకు క్లోజ్ కాబట్టి ఆ పాత్ర నేను చేస్తానని అన్నానని, అలా చేస్తే మీ అభిమానులు మమ్మలని కొడతారని అంటే అందుకు ఆయన నాకు దేవదాసు తర్వాత అన్నీ తాగుబోతు కథలు వస్తున్నాయి, అందుకని నేను ఇమేజ్ మార్చుకోవాలని అన్నారని, అలానే అడిగి మరీ మిస్సమ్మ చేశా అని చెప్పినట్టు రాజమౌళి వెల్లడించారు. చక్రపాణి గారు, వాళ్ళు అభిమానులు కొడతారని చెప్పినా సరే… పట్టుబట్టి చేశానని ఇమేజ్ మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుందని ఆయన గమనించి చేయడం గొప్ప విషయం అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆయన మీద ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ కి చేతులు ఎత్తి నమస్కరించాలని పేర్కొన్న రాజమౌళి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎన్నో కథలు విన్నానని అన్నారు. ఇక స్వయంగా ఆయనకు దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఎన్నో భక్తి రస చిత్రాల్లో నటించారు. పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను వేరుగా చూడడం ఆయన నుంచే ఇప్పటి సినీ పరిశ్రమ వారు చాలా మంది నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.

Show comments