Navdeep: హైకోర్టులో నవదీప్ కి షాక్.. అరెస్ట్ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court Disposes Navdeep Bail Petition: తెలుగు సినీ హీరో నవదీప్ గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్ కేసు వ్యవహరిత వార్తలలో ఎక్కువగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన రామచంద్ అనే వ్యక్తి ద్వారా నవదీప్ కి డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నవదీప్ కి కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆయన పరారీలో ఉన్నాడని హాట్ కామెంట్లు చేశారు తర్వాత నవదీప్ తాను పరారీలో లేనని హైదరాబాదులో ఉన్నానని క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ కేసులో నవదీప్ ని అరెస్టు చేయకుండా ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసి ఆ మేరకు ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు మరోసారి కోర్టుకు వెళ్లిన నవదీప్ కి మాత్రం హైకోర్టు షాక్ ఇచ్చింది. నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. నవదీపు కి బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది.
The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..
Also Read
ఇక ఈ మేరకు పోలీసుల విచారణకు హాజరుకావాలని హీరోకు కోర్టు స్పష్టం చేసింది. నిన్ననే హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు కూడా చేసంది. పోలీసులు సోదాలు చేసే సమయంలో ఇంట్లో లేని నవదీప్, తనను అరెస్టు చేయవద్దు ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఉండగా డ్రగ్స్ కేస్ లో నవదీప్ మరోసారి హై కోర్ట్ లో పిటిషన్ వేశాడు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిగింది. నవదీప్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు తమకు నవదీప్ కస్టడీ కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక నిన్న సోదాలకి పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేరు. ఇక ఈ మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో 37వ నిందితుడిగా నవ దీప్ ను నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో నవదీప్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది.
తాజావార్తలు
-
Arshdeep Singh: వైట్ బాల్ స్టార్ టు రెడ్ బాల్ స్పెషలిస్ట్.? టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధం..! బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Jamia University: జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్ష ముగింపు.. ఎన్నికలపై కీలక ప్రకటన!
-
Maredumilli Fire Accident: మారేడుమిల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రాణనష్టం!
-
Ghatkesar News: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా..
-
Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!