దర్శక ధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’. కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగులో హీరోయిన్ శ్రేయ నటించిన పాత్రని హిందీలో నుష్రత్ బరుచా ప్లే చేసింది. రీసెంట్ గా ఒక జ్యువెల్లరి ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన నుష్రత్ బరుచా, ఎన్టీవీతో స్పెషల్ చిట్ చాట్ చేసింది.
Read Also: Singam Again: సింగం 3 ఆన్ కార్డ్స్… రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది
ఈ సంధర్భంగా నుష్రత్ బరుచా మాట్లాడుతూ… “రాజమౌళి, ప్రభాస్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చెయ్యడం చాలా గ్రేట్ ఫీలింగ్ ని ఇచ్చింది. బాహుబలి సినిమా చూసినప్పుడు ఆ స్టొరీ టెల్లింగ్ కి ఫిదా అయిపోయాను. బాహుబలి సినిమా నార్త్ స్టార్స్ అందరినీ తెలుగుకి రప్పిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సెట్స్ లో చాలా ఫన్నీగా ఉంటాడు. వినాయక్ మేకింగ్ చాలా బాగుంది” అంటూ ఛత్రపతి సినిమాలో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది. మరి మే 12న ఛత్రపతి సినిమాని నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మంచి కథ, నార్త్ ఆడియన్స్ కి కావాల్సిన సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఛత్రపతి సినిమాలో కావలసినన్ని ఉన్నాయి కాబట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ అందుకోవడం గ్యారెంటీగానే కనిపిస్తోంది.