Singam Again: సింగం 3 ఆన్ కార్డ్స్… రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ ఇది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ సూర్య ‘సింగం’ సినిమాని హిందీలో రీమేక్ చేసి మాస్ హిట్ కొట్టారు. ఆ తర్వాత సింగం రిటర్న్స్ పేరుతో మరో సినిమా చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. నార్త్ ఆడియన్స్ కి పోలిస్ సినిమా అనగానే ‘సింగం’ క్యారెక్టర్ గుర్తొచ్చే రేంజులో రెండు సినిమాలు ఆడడంతో, ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘సూర్యవన్షీ’ సినిమా క్లైమాక్స్ లోకి అజయ్ దేవగన్ ని తీసుకోని వచ్చి సింగం 3కి లీడ్ ఇచ్చాడు రోహిత్ శెట్టి.
‘సూర్యవన్షీ’ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ఒక టెర్రరిస్ట్ కోసం పాకిస్థాన్ వెళ్తున్నట్లు చూపించారు కాబట్టి ‘సింగం అగైన్’ పాకిస్థాన్ నేపధ్యంలో తెరకెక్కనుంది. సూర్యవన్షీ సినిమా ఎండ్ లో సింగం 3కి ఇచ్చిన లీడ్ ని నిజం చేస్తూ అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిలు కలిసి ‘సింగం అగైన్’ సినిమాని ఈ ఏడాది ఆగస్ట్ నెలలో సెట్స్ పైకి తీసుకోని వెళ్లనున్నారు. ‘సింగం అగైన్’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ 2024 ఆగస్ట్ 15న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి భాజీరావ్ సింగం క్యారెక్టర్ లో ఈసారి అజయ్ దేవగన్-రోహిత్ శెట్టిలు ఎంత ఫైర్ చూపిస్తారు, ఎంత పెద్ద హిట్ అందుకుంటారు అనేది చూడాలి. ఇది మా కాంబినేషన్ లో 11వ హిట్ అవుతుంది’ అంటూ అజయ్ దేవగన్ ట్వీట్ చేశాడు. దీంతో సింగం సీరీస్ నుంచి మూడో సినిమా వస్తుంది అనే వార్త అఫీషియల్ అయ్యింది.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
#Xclusiv… AJAY DEVGN – ROHIT SHETTY: ‘SINGHAM AGAIN’ ON INDEPENDENCE DAY 2024… #SinghamAgain – the third part in #RohitShetty’s super-successful #Singham franchise – to release on 15 August 2024 #IndependenceDay.#AjayDevgn returns as #BajiraoSingham… Starts August 2023. pic.twitter.com/RkWMeau7yS
— taran adarsh (@taran_adarsh) April 22, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!