NTV Telugu Site icon

SSMB 29: ఆగస్టులోనే అనౌన్స్మెంట్? రాజమౌళి రెడీ అయ్యాడా?

Ssmb 29

Ssmb 29

‘SSMB 29’ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపైన్ లో కూడా SSMB 29 సినిమా గురించి ఎలివేషన్స్ ఇచ్చాడు జక్కన్న. లేటెస్ట్ గా మరో అప్డేట్ ఇస్తూ… ప్రస్తుతం SSMB 29 ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది, ఈ ఆగస్టులో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత SSMB 29 వర్క్ షాప్ కొన్ని రోజులు జరిగే అవకాశం ఉంది. ఈలోపు SSMB 28 సినిమా షూటింగ్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేయనున్నాడు. SSMB 28 కంప్లీట్ చేసుకొని SSMB 29 వర్క్ షాప్ లో జాయిన్ అవ్వనున్నాడు.

వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మరో రెండేళ్ల పాటు షూటింగ్ ఏడాది పాటు పోస్ట్ ప్రొడక్షన్ చేసి SSMB 29ని 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాజమౌళి ఉన్న ఫేజ్ కి SSMB 29 పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైనన్ని ఎక్కువ భాషల్లో, వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో SSMB 29ని రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తాడు. అవతార్, అవెంజర్స్ లాంటి సినిమాలు వేల కోట్లు రాబడుతుంటే చూసి ఆశ్చర్యపోతున్నాం కదా రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం మన ఇండియన్ సినిమా ‘SSMB 29’ కూడా మినిమమ్ రెండు వేల కోట్ల నుంచి కౌంట్ మొదలుపెట్టాల్సి వస్తుంది.

Show comments