Site icon NTV Telugu

SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?

Ssmb 29

Ssmb 29

SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ29 గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి చిన్న క్లూ కూడా జక్కన్న చెప్పలేదు. కానీ మొన్న రాఖీ పండుగ నాడు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కావడంతో ప్రీ లుక్ పోస్టర్ వదిలాడు. అందులో ఫేస్ రివీల్ చేయలేదు గానీ.. మెడలో దండను హైలెట్ చేశాడు జక్కన్న. రాజమౌళి ఏం చేసినా దాని వెనకాల ఓ ప్లాన్ ఉంటుంది. మహేశ్ బాబు మెడలో ఉన్న దండలో నందీశ్వరుడు, శివలింగం, త్రిశూలం లాంటివి కనిపిస్తున్నాయి.

Read Also : Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్

ఇది గ్లోబ్ ట్రాటర్ కథ అని చెప్పేశాడు జక్కన్న. అంటే ప్రపంచ వ్యాప్తంగా తిరిగేవాడు అని అర్థం. ఎక్కువగా అడవుల చుట్టూ కథ ఉంటుందనేది కామన్ ప్రచారం. సింహాలు, జంతువులతో సీన్లు ఉంటాయి. ఇందులో సనాతన ధర్మం కాన్సెప్ట్ ను కూడా హైలెట్ చేయబోతున్నాడంట జక్కన్న ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రీసెంట్ టైమ్స్ లో దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం కాన్సెప్టుతో వస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. మన ధర్మం, కల్చర్ అనే కాన్సెప్టును ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు.

పైగా ఈ కథలో ప్రకృతి చుట్టూ కథ సింక్ అయి ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలోని ప్రకృతిని ప్రేమించాలనే కాన్సెప్టును ఇందులో హైలెట్ చేయబోతున్నాడంట జక్కన్న. మనం ఏది చేస్తే ప్రకృతి మనకు అదే తిరిగి ఇస్తుందనేది ఇందులో ఓ సీన్ తో చెబుతున్నాడంట జక్కన్న. అలా అని పూర్తిగా కాషాయ మార్గం పట్టకుండా.. సినిమాలో అడ్వెంచర్స్, యాక్షన్ ఎలివేషన్స్, బలమైన ఎమోషన్స్, కంటెంట్ ను రంగరిస్తున్నాడు మన రాజమౌళి. మరి రాజమౌళి ఎంచుకుంటున్న సనాతన ధర్మం కాన్సెప్టు ఇందులో ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Read Also : WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టే వార్-2.. ఫ్యాన్స్ డోంట్ వర్రీ

Exit mobile version