Site icon NTV Telugu

Globetrotter-event : గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌‌ కోసం వచ్చే అభిమానులకు.. రాజమౌళి సూచనలు

Globetrotter Rajamouli Update

Globetrotter Rajamouli Update

ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న “గ్లోబ్ ట్రోటర్” (Globetrotter) ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్‌ 15న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక X ఖాతా ద్వారా పాల్గొనేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. అయన ట్వీట్‌లో పేర్కొంటూ.. “నవంబర్‌ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో సహకరించండి, ఈవెంట్‌‌కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. ఇక  ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది.  ఈ ఈవెంట్‌‌ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు.. కేవలం ఫిజికల్ పాసులు ఉంటేనే రండి . అలాగే   విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ల కోసం పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు – రాజమౌళి” అని తెలిపారు.

Also Read : Akhanda-2 : ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్‌పై మాస్ అప్డేట్..

రాజమౌళి చెప్పిన ఈ సూచనలు ఈవెంట్‌కు హాజరయ్యే వేలాది మందికి ముఖ్య మార్గదర్శకంగా మారాయి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లు తో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అభిమానులందరూ రాజమౌళి ఇచ్చిన సూచనలను పాటించి ఈవెంట్‌ను ఆనందంగా ఆస్వాదించాలని నిర్వాహకులు సూచించారు.

 

Exit mobile version