RRR Delhi Promotions సరదాగా సాగుతున్నాయి. రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరు స్టార్ హీరోలు తారక్, చెర్రీలపై జక్కన్న ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు సెట్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. అయితే సినిమా మోస్ట్ ఛాలెంజింగ్ కాదు వీళ్ళిద్దరే అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
Read Also : RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
రాజమౌళి మాట్లాడుతూ “సినిమా సెట్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ గా అన్పించింది అంటే వీళ్లిద్దరే… చెర్రీ, తారక్ ను కంట్రోల్ చేయడం నాకు పెద్ద ఛాలెంజ్… కానీ మంచోళ్ళు కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఇద్దరూ కంట్రోల్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే తారక్ అందుకుని “మేము ఏం చేశామో చెప్పండి?” అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి “నేను మీరు మంచోళ్ళనే సర్టిఫికెట్ ఇస్తున్నా” అని అన్నారు. మొత్తానికి ఢిల్లీలో జరిగిన మీడియా ఇంటరాక్షన్ సరదాగా సాగిందని చెప్పాలి.
