Site icon NTV Telugu

RRR : ఒక్క రోజుకి 50 లక్షలు… కానీ ఆ సీనే లేదట !

RRR

RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్‌తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్ నడుస్తోంది. సినిమా నిడివి ఎక్కువగా ఉందన్న కారణంగా రాజమౌళి సినిమాలోని ఒక నిమిషం 36 సెకన్ల నిడివి గల ఎన్టీఆర్ కీలక సన్నివేశాన్ని కత్తిరించారు. ఒకవేళ సినిమా విడుదలయ్యాక RRRకు అద్భుతమైన స్పందన వస్తే ఈ సీన్ ను యాడ్ చేస్తారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్

ఇక సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం దుబాయ్ లో ఉన్నారు. మార్చ్ 20 నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీం మొత్తం కలిసి పలు ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను ఘనంగా జరపనున్నారు.

Exit mobile version